
సినిమాలు

తమిళనాడులో రాజకీయ ఉత్కంఠకు తెరదించుతూ జోసెఫ్ విజయ్ ఆదివారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో నటి త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంప్రదాయ నీలం రంగు పట్టుచీరలో హుందాగా కనిపించిన త్రిష అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రమాణస్వీకారం అనంతరం ఆమె ప్రేమ గురించి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
“ప్రేమ ఎప్పుడూ గొప్పగానే వ్యక్తమవుతుంది” అంటూ నీలం హార్ట్ ఎమోజీతో త్రిష పోస్ట్ చేశారు. తనకు ఎంతో ఇష్టమైన తన టీమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. విజయ్‌తో త్రిష ఐదు హిట్ సినిమాల్లో నటించగా, అవి ఇద్దరి కెరీర్లోనూ కీలక మలుపు తిప్పాయి. ప్రమాణస్వీకార వేడుకలో విజయ్ ప్రమాణం చేస్తుండగా త్రిష భావోద్వేగానికి గురైనట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!