
జనరల్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై సంచలన ఆరోపణలు చేశారు. సుమారు 22 కోట్ల మంది అమెరికన్ ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని చైనా దొంగిలించిందని ఆయన ఆరోపించారు. ఇటీవల డీ-క్లాసిఫై చేసిన ఇంటెలిజెన్స్ పత్రాల్లో ఈ అంశానికి సంబంధించిన వివరాలు ఉన్నాయని, అయితే ఇంటెలిజెన్స్ వ్యవస్థలోని కొందరు అధికారులు ఈ విషయాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని ట్రంప్ పేర్కొన్నారు.
ఓటర్ల పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, రాజకీయ అనుబంధాలకు సంబంధించిన సమాచారం చైనా చేతికి వెళ్లిందని ట్రంప్ ఆరోపించారు. ఈ వ్యవహారం అమెరికా జాతీయ భద్రత, ఎన్నికల భద్రతకు సంబంధించిన కీలక అంశమని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత సంస్థలు లేదా చైనా ప్రభుత్వం నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!