
టెక్నాలజీ

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ వేళ విషాదం చోటుచేసుకుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అభ్యర్థి మహమ్మద్ అన్వర్ (40) నిన్న రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఎర్రగడ్డలో నివసించే ఆయన అక్టోబర్ 22న నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారులు ఆయన నామినేషన్ను ఆమోదించడంతో ఆయన అధికారికంగా పోటీలో నిలిచారు. అయితే ఫలితాలకు ఒక్కరోజు ముందు అన్వర్ అకస్మాత్తుగా మరణించడంతో ఆయన అనుచరులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!