

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి పాల్గొననున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులకు పిలుపునిచ్చారు. సిరిసిల్లతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చేలా సమష్టిగా కృషి చేయాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. రైతు రుణమాఫీ, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, ఉచిత విద్యుత్, సామాజిక భద్రత వంటి కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు. ముఖ్యమంత్రి పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో సభకు ప్రాధాన్యత ఉందన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి నాయకులు సమన్వయంతో పనిచేసి మహిళలు, యువత, రైతులు, కార్మికులు, నేతన్నలు సహా అన్ని వర్గాల ప్రజలు పాల్గొనేలా చూడాలని కోరారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!