

తెలంగాణలో చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ నేడు ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగగా, ఓటర్లు క్రమశిక్షణతో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది. అనంతరం వైస్ సర్పంచ్ ఎన్నికలను కూడా నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ముందు క్యూ లైన్లో ఉన్న ఓటర్లకు ఓటు వేసే అవకాశం కల్పించారు.
ఓట్ల లెక్కింపులో భాగంగా ముందుగా పోస్టల్ బ్యాలెట్లను, అనంతరం బ్యాలెట్ పేపర్లను లెక్కించనున్నారు. నేటి చివరి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 3,753 సర్పంచ్ పదవులు, 28,410 వార్డు సభ్యుల పదవులకు పోలింగ్ జరిగింది.
చెదురుమదురు ఘటనలు తప్పితే, ఎక్కడా పెద్ద ఎత్తున అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మూడో విడత ఎన్నికల సందర్భంగా ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎన్నికలను సజావుగా నిర్వహించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!