
గాసిప్స్

గతంలో ఉస్మానియా యూనివర్సిటీ, తిరుమలగిరి, మట్టంపల్లి పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల విచారణకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఓయూలో నిబంధనలకు విరుద్ధంగా బహిరంగ సభ నిర్వహించారనే ఆరోపణలపై 2016లో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదే సమయంలో వివిధ కారణాలతో తిరుమలగిరి, మట్టంపల్లి పోలీస్ స్టేషన్లలోనూ కేసులు నమోదయ్యాయి.
ఈ కేసులను కొట్టివేయాలని కోరుతూ సీఎం నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టును ఆశ్రయించారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే తనపై అక్రమంగా కేసులు నమోదు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై కొనసాగుతున్న విచారణకు సీఎం స్వయంగా హాజరుకాగా, మూడు కేసులకు సంబంధించిన విచారణ పూర్తయినట్లు సమాచారం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!