

తెలంగాణ పురపాలక ఎన్నికల నగారా మోగడంతో రాజకీయాలు వేడెక్కాయి. ఈ ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రచారంలో పాల్గొనబోతుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశగా జనసేన ఒంటరిగా పోటీ చేయాలని భావించినప్పటికీ, తాజా పరిణామాల ప్రకారం బీజేపీతో కలిసి ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇతర నేతలు పవన్‌ను కలిసి మద్దతు కోరారు.
ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో, పవన్ కళ్యాణ్ తెలంగాణలోని ప్రధాన మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లలో రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొనే అవకాశం ఉంది.
7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలు.
ఏపీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన తర్వాత తెలంగాణలో పవన్ అడుగుపెడుతుండటంతో జనసైనికుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. పవన్ రాకతో ఓట్ల శాతం గణనీయంగా పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!