

తెలంగాణ రాజకీయాల్లో కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) తొలిసారి ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి పార్టీ అభ్యర్థిగా సీనియర్ జర్నలిస్ట్ ఆకాష్ కొల్లూరిని పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఇప్పటికే వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బీసీ అభ్యర్థి నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను ప్రకటించిన కవిత, రెండో స్థానానికి కూడా బీసీ అభ్యర్థినే ఎంపిక చేశారు. హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ చిట్నేని రఘును అబ్జర్వర్, కోఆర్డినేటర్‌గా నియమించారు. రెండు నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల వ్యూహాలు, వార్ రూమ్ బాధ్యతలను ప్రముఖ న్యాయవాది రామ్ కల్యాణ్ చల్లాకు అప్పగించారు.
ఇక రెండు ఎమ్మెల్సీ నియోజకవర్గాల పరిధిలో జిల్లా వారీగా ఇన్ఛార్జులను కూడా పార్టీ ప్రకటించింది. హైదరాబాద్ బాధ్యతలను సురభి, మతీన్, బండారి మహేందర్ ముదిరాజ్‌కు అప్పగించగా.. రంగారెడ్డికి అర్చన సేనాపతి, మహబూబ్‌నగర్‌కు రంజిత్ గొంగళ్లను నియమించారు. అలాగే నల్గొండకు సుజిత్, ఖమ్మంకు గట్టు కరుణ, వరంగల్‌కు మడుగుల రాజిరెడ్డిని ఇన్‌ఛార్జులుగా నియమించారు. హైదరాబాద్‌కు చెందిన ఆకాష్ కొల్లూరికి జాతీయ మీడియా సంస్థల్లో దశాబ్దానికి పైగా పనిచేసిన అనుభవం ఉంది. ఇండియా టుడే, రిపబ్లిక్ టీవీ, సీన్ఎన్-న్యూస్18, డైలీహంట్ వంటి ప్రముఖ సంస్థల్లో ఆయన పనిచేశారు. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసిన ఆయన, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బంగారు పతకంతో పట్టభద్రులయ్యారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!