

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో ఆధునిక ధాన్య నిల్వ వ్యవస్థల ఏర్పాటుపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు, నిల్వ వ్యవస్థను మరింత ఆధునీకరించే లక్ష్యంతో 23 జిల్లాల్లో అత్యాధునిక సైలో టెర్మినల్స్ ఏర్పాటు ప్రతిపాదనలపై అధికారులు, ఏజెన్సీలతో చర్చించారు. వర్షాలు, తేమ, పురుగుల ప్రభావం లేకుండా శాస్త్రీయ పద్ధతుల్లో ధాన్యాన్ని భద్రపరచడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది.
ఈ ప్రణాళికలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 82 సైలో టెర్మినల్స్‌ను ఏర్పాటు చేసి 47.5 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యాన్ని సృష్టించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. సుమారు రూ.4,450 కోట్ల పెట్టుబడులతో ఈ ప్రాజెక్టును అమలు చేయడానికి ప్రాథమిక చర్చలు కొనసాగుతున్నాయి. ధాన్యం నిల్వ, రవాణా, పంపిణీ వ్యవస్థలను పూర్తిగా ఆధునీకరించి రైతులకు మెరుగైన సేవలు, వినియోగదారులకు నాణ్యమైన బియ్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!