
రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు తుదిదశకు చేరుకుంది. ఈ రోజు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను విచారించనున్నారు. నాగేందర్ విచారణ ఇప్పటికే చేపట్టాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు ఈ విచారణ మధ్యాహ్నం 2.30 గంటలకు నిర్వహించనున్నారు. ఇక ఎమ్మెల్యే కడియం శ్రీహరి విచారణ ఇప్పటికే పూర్తి కాగా తీర్పు రిజర్వ్ చేయబడింది.
గత నెలలో తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు వారాల్లో తీర్మానం తీసుకోకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతుందని ఫిబ్రవరి 6న హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు మరో అవకాశం ఇచ్చారు. కోర్టు స్పీకర్‌ను అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తిచేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. దానం నాగేందర్ విచారణతో మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణలు పూర్తి కాబోతున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!