
న్యూస్

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 30 వరకు కొనసాగనున్నట్లు బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ స్పీకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పనిదినాలు మరియు అజెండాపై చర్చించారు. గవర్నర్ ప్రసంగంపై చర్చలు ఈ నెల 17, 18 తేదీల్లో జరగనున్నాయి. 20వ తేదీన రాష్ట్ర బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 21వ తేదీన రంజాన్ సందర్భంగా అసెంబ్లీకి సెలవు ప్రకటించారు.
అనంతరం 23, 24, 25, 26 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చలు జరగనున్నాయి. 30వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశానికి ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, విప్ బీర్ల ఐలయ్య హాజరయ్యారు. ప్రతిపక్ష పార్టీల నుంచి హరీష్ రావు, కేపీ వివేకానంద, మహేశ్వర్ రెడ్డి, కౌసర్ మొహియుద్దీన్, కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!