
జనరల్

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. విజయ్‌కు మద్దతు ఇవ్వాలా వద్దా అనే విషయంలో పార్టీల మధ్య హైడ్రామా నెలకొంది. వీసీకే తరఫున జ్యోతిమణి, వన్నీరసు ఎమ్మెల్యేలుగా గెలిచారు. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ స్థానాల్లో విజయ్ గెలిచినప్పటికీ, రాజకీయ సమీకరణాలు ఇంకా స్పష్టత పొందలేదు.
డిప్యూటీ సీఎం పదవితో పాటు తిరుచ్చి ఈస్ట్ సీటు వంటి పలు డిమాండ్లు వీసీకే ముందుంచినట్లు సమాచారం. చివరి నిమిషంలో మద్దతు లేఖ ఇవ్వకుండా వీసీకే వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై వీసీకే చీఫ్ తిరుమావళవన్ డీఎంకే అధినేత స్టాలిన్‌తో భేటీ అయ్యారు. మద్దతు ప్రకటిస్తే విజయ్‌కు సీఎం మార్గం సుగమమవుతుంది, లేకపోతే ఉత్కంఠ కొనసాగనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!