

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన నిర్ణయాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన ప్రచార విధానాలు, వ్యక్తిగత గుర్తింపును మరింతగా ప్రదర్శించే చర్యలతో మరోసారి చర్చనీయాంశంగా మారారు. అమెరికా ప్రభుత్వ భవనాలపై అధ్యక్షుని చిత్రాలతో కూడిన బ్యానర్లు కనిపించడం ఇప్పటివరకు అరుదు. అయితే ఇప్పుడు దేశంలోని అనేక ప్రాంతాల్లో ట్రంప్ పేరు, ఫొటోలు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి.
ఇక తాజాగా, అమెరికా విదేశాంగ శాఖ ప్రత్యేకంగా రూపొందిస్తున్న పాస్‌పోర్టుల్లో ట్రంప్ చిత్రం ముద్రించనున్నట్లు అధికారులు వెల్లడించారు. వచ్చే జులై 4 నాటికి అమెరికా స్వాతంత్రానికి 250 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా పరిమిత సంఖ్యలో ప్రత్యేక పాస్‌పోర్టులను విడుదల చేయాలని నిర్ణయించారు.
ఈ ప్రత్యేక పాస్‌పోర్ట్‌లో ఒక పేజీ మొత్తంలో ట్రంప్ చిత్రం ఉండగా, మరో పేజీలో అమెరికా వ్యవస్థాపక పితామహుల చారిత్రక చిత్రాలు ఉంటాయి. అలాగే ట్రంప్ సంతకం కూడా బంగారు రంగులో ముద్రించబడుతుంది.
ఇదిలా ఉండగా, ట్రంప్ పేరుతో ఇప్పటికే ఒక ప్రభుత్వ పథకం ప్రవేశపెట్టినట్లు సమాచారం. త్వరలో ఆయన సంతకంతో కూడిన కరెన్సీ నోట్లను కూడా ముద్రించేందుకు అమెరికా ఆర్థిక శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని అధికారులు పేర్కొన్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!