
గాసిప్స్

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ ప్రసాద్ కీలక తీర్పు ఇచ్చారు. ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డిపై ఫిరాయింపులకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు లేవని పేర్కొంటూ వారికి క్లీన్ చిట్ ఇచ్చారు. దీంతో ఈ ఇద్దరినీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
ఇదే కేసులో గతంలో దాఖలైన ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను ఇప్పటికే కొట్టివేశారు. కాగా, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్కు సంబంధించిన కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నట్లు స్పీకర్ స్పష్టం చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!