

పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి లకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని బీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్‌పై పోటీ చేసి గెలిచిన వ్యక్తికే క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజల తీర్పును అవమానించడమేనని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఓట్లతో గెలిచిన పదవులను వ్యక్తిగత ప్రయోజనాల కోసం మార్చుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించారు.
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేలా స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజుగా నిలుస్తుందని కేటీఆర్ అన్నారు. ఇది కేవలం ఒక తీర్పు మాత్రమే కాకుండా అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించే ఉదాహరణ అని విమర్శించారు. ఇలాంటి నిర్ణయాలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని, తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో సమాధానం చెబుతారని ఆయన హెచ్చరించారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!