

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌పై దాఖలైన అనర్హత పిటిషన్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పిటిషన్లను పరిశీలించిన అనంతరం వాటిని డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు నిర్ధారించే స్పష్టమైన ఆధారాలు లేవని స్పీకర్ తెలిపారు. ఈ అంశంపై విచారణకు సుప్రీం కోర్టులో కేసు ఉండగా, దానికి ముందు రోజు స్పీకర్ ఈ నిర్ణయం ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇక మొత్తం పది మంది ఎమ్మెల్యేలపై వచ్చిన అనర్హత పిటిషన్లను కూడా పరిశీలించిన స్పీకర్, అందరికీ క్లీన్ చిట్ ఇచ్చారు. తగిన ఆధారాలు లేకపోవడంతో వారిపై చర్యలు తీసుకునే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకోగా, వివిధ పార్టీల నేతలు దీనిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!