

పుదుచ్చేరిలో పోలీసులు తన కుటుంబ సభ్యులను కలిసి పలు ప్రశ్నలు అడిగారని దాస్ సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. ఇది సాధారణ విచారణ కాదని, తనను మౌనం చేయించేందుకు కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న చర్యగా ఆయన పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం తన కుటుంబాన్ని ఎందుకు భయపెడుతోందని ప్రశ్నించిన దాస్.. ఈ విచారణకు చట్టపరమైన ఆధారం ఏమిటని నిలదీశారు. తనను బెదిరించి మౌనం చేయాలని చూస్తే అది సాధ్యం కాదని, ఇలాంటి చర్యలు తన పోరాటాన్ని మరింత బలపరుస్తాయని అన్నారు.
రెండు రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పుదుచ్చేరి పర్యటనలో హోంమంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్‌తో సమావేశమైన విషయాన్ని కూడా దాస్ ప్రస్తావించారు. ఆ సమావేశం తర్వాతే తన కుటుంబాన్ని పోలీసులు సందర్శించారా అని ప్రశ్నించారు. అయితే పోలీసుల వాదన భిన్నంగా ఉంది. దాస్ బంధువుల ఇంటికి పోలీసులు వెళ్లిన విషయం వాస్తవమేనని, కానీ ఎలాంటి వేధింపులు లేదా బెదిరింపులకు పాల్పడలేదని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు భద్రతా చర్యల్లో భాగంగా కీలక మార్గాల సమీపంలో నివసించే ప్రజల ఇళ్లను సందర్శించి వివరాలు సేకరించడం సాధారణ ప్రక్రియ అని స్పష్టం చేశారు. దీంతో ఈ ఘటనపై ఆరోపణలు, పోలీసుల వివరణ మధ్య విభేదాలు నెలకొన్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!