4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అన్ని సేవలు కు ఒకే కార్డ్... ఏపీ సీఎం చంద్రబాబు

Writer: Venkatesh 04:44 PM, 24 నవంబర్, 2025
అన్ని సేవలు కు ఒకే కార్డ్... ఏపీ సీఎం చంద్రబాబు

ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్‌ సిస్టం (FBMS) అమలు పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో సమీక్ష నిర్వహించారు. కుటుంబాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఒకేచోట అందించే విధంగా స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్‌ను రూపొందించాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు, రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలను రియల్ టైమ్ గవర్నెన్స్‌ డేటా లేక్‌ ఆధారంగా సేకరించి అప్‌డేట్ చేయాలని సూచించారు. పౌరసేవలు, ప్రభుత్వ పథకాల పర్యవేక్షణకు ఈ ఒక్క కార్డే ప్రధాన ఆధారంగా ఉండేలా వ్యవస్థను అభివృద్ధి చేయాలని తెలిపారు.

రాష్ట్రంలోని 1.4 కోట్ల కుటుంబాలకు జూన్ నాటికి క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ ఫ్యామిలీ కార్డులను జారీ చేయాలని అధికారులు సిద్ధం కావాల్సిందిగా ఆదేశించారు. మొత్తం 25 రకాల ప్రభుత్వ సేవలు, పథకాలు, అలాగే పీ 4 వంటి ముఖ్య అంశాలను ఈ కార్డులో చేర్చాలని సూచించారు.

ఆధార్, ఎఫ్‌బీఎంఎస్ ఐడీ, వాక్సినేషన్, కుల ధృవీకరణ, పౌష్టికాహారం, రేషన్ కార్డు, స్కాలర్‌షిప్‌లు, పెన్షన్లు వంటి విభిన్న సేవలకు సంబంధించిన సమాచారాన్ని ఈ కార్డు ద్వారా ట్రాక్ చేసే విధంగా వ్యవస్థ ఉండాలని సీఎం అన్నారు. కేవలం రేషన్, పెన్షన్లకే పరిమితం కాకుండా పౌరులకు సంబంధించిన అన్ని కీలక డేటా ఇందులో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.

సుపరిపాలనలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు సులభంగా చేరేందుకు ఈ స్మార్ట్ కార్డు కీలక పాత్ర పోషిస్తుందని సీఎం పేర్కొన్నారు. లబ్ధిదారుల ఎంపికలో ఎదురయ్యే సమస్యలు కూడా ఈ వ్యవస్థతో తగ్గుతాయని స్పష్టం చేశారు.

పట్టణాలు, గ్రామాల్లో స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ ద్వారా కుటుంబ వివరాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అయ్యేలా పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. ఆధార్ సహా అన్ని వివరాలు ఒకే కార్డు ద్వారా తెలిసేలా డిజైన్ చేయాలని సూచించారు.

2026 జనవరి నాటికి పూర్తి డేటాను సమీకరించి, జూన్‌లోగా కార్డుల పంపిణీ పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీజేపీకి గుడ్‌బై.. కొత్త పార్టీ ప్రకటించిన మనీష్‌ బ్రహ్మభట్‌

సీజేపీకి గుడ్‌బై.. కొత్త పార్టీ ప్రకటించిన మనీష్‌ బ్రహ్మభట్‌

స్థానిక ఎన్నికలకు టీడీపీ రెడీ.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక ఆదేశాలు

స్థానిక ఎన్నికలకు టీడీపీ రెడీ.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక ఆదేశాలు

నాకు పదవులపై ఆశ లేదు: చిన్నారెడ్డి

నాకు పదవులపై ఆశ లేదు: చిన్నారెడ్డి

నాకు చెప్పకుండా తొలగించారు - మంత్రి కొండా సురేఖ

నాకు చెప్పకుండా తొలగించారు - మంత్రి కొండా సురేఖ

లోకనాథం అరెస్టు వెనుక కుట్ర ఉంది: భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు

లోకనాథం అరెస్టు వెనుక కుట్ర ఉంది: భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు

సురేఖ బర్తరఫ్‌పై కాంగ్రెస్‌ను నిలదీసిన  శ్రీనివాస్ గౌడ్

సురేఖ బర్తరఫ్‌పై కాంగ్రెస్‌ను నిలదీసిన శ్రీనివాస్ గౌడ్

ట్యాగ్లు
చంద్రబాబుఅమరావతిపౌరసేవలుప్రభుత్వ పథకాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మాషా అల్లా స్క్రబ్బర్‌ కేసు..తొలి రోజు విచారణలో నోరు విప్పని దంపతులు
జనరల్

మాషా అల్లా స్క్రబ్బర్‌ కేసు..తొలి రోజు విచారణలో నోరు విప్పని దంపతులు

‘ఐయామ్‌ గేమ్‌’ రివ్యూ: దుల్కర్‌ నటన సినిమాను నిలబెట్టిందా?
రివ్యూలు

‘ఐయామ్‌ గేమ్‌’ రివ్యూ: దుల్కర్‌ నటన సినిమాను నిలబెట్టిందా?

చదువు పూర్తి చేయలేకపోయాననే పశ్చాత్తాపం ఉంది: కరీనా కపూర్‌
సినిమాలు

చదువు పూర్తి చేయలేకపోయాననే పశ్చాత్తాపం ఉంది: కరీనా కపూర్‌

హైదరాబాద్ జేఎన్‌టీయూలో విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ.. ఉద్రిక్తత
జనరల్

హైదరాబాద్ జేఎన్‌టీయూలో విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ.. ఉద్రిక్తత

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్
జనరల్

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్

న్యూస్ వెబ్సైటు లో సీఎం భద్రతా సమాచారం... కేసు నమోదు
జనరల్

న్యూస్ వెబ్సైటు లో సీఎం భద్రతా సమాచారం... కేసు నమోదు

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమోతో పెరిగిన హైప్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమోతో పెరిగిన హైప్

గుంటూరు బాలిక కిడ్నాప్‌ కేసులో కీలక మలుపు..
జనరల్

గుంటూరు బాలిక కిడ్నాప్‌ కేసులో కీలక మలుపు..

ఇరాన్‌ పెళ్లి వేడుక దాడిపై వాన్స్ స్పందన
జనరల్

ఇరాన్‌ పెళ్లి వేడుక దాడిపై వాన్స్ స్పందన

శ్రీకృష్ణ జన్మాష్టమి విశిష్టత..
జనరల్

శ్రీకృష్ణ జన్మాష్టమి విశిష్టత..

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

డ్రైవర్‌లెస్ సైబర్‌క్యాబ్ సేవలు ప్రారంభించిన టెస్లా
బిజినెస్

డ్రైవర్‌లెస్ సైబర్‌క్యాబ్ సేవలు ప్రారంభించిన టెస్లా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!