
గాసిప్స్

ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావుకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో భాగంగా విచారణకు హాజరుకావాలని సూచిస్తూ, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు రేపు ఉదయం 11 గంటలకు రావాలని సిట్ పేర్కొంది.
ఈ వ్యవహారంపై ఇప్పటికే సిట్ విస్తృతంగా దర్యాప్తు కొనసాగిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై హరీష్ రావు వాంగ్మూలం నమోదు చేసుకునేందుకు ఈ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిన నేపథ్యంలో, తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!