
రివ్యూలు

గతంలో తెలంగాణలో మూడు లక్షల ఎకరాల్లో కూరగాయల సాగు జరిగేదని, ప్రస్తుతం కేవలం 50 వేల ఎకరాల్లోనే సాగు జరుగుతోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, కూరగాయల సాగును పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అందరూ ఒకే మాటపై ఉండి సమష్టిగా కృషి చేస్తే వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకురావచ్చని పేర్కొన్నారు.
పురుగుల నివారణకు ఉపయోగించే మందులపై రాయితీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం కేంద్ర పథకాలను సక్రమంగా వినియోగించుకోలేదని ఆరోపించారు. కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!