

వేలాది మంది అమెరికన్లు, అమెరికా కంపెనీలకు చెందిన డేటాను హ్యాక్ చేసి చోరీ చేశాయన్న ఆరోపణల నేపథ్యంలో భారత్‌కు చెందిన మూడు సంస్థలపై చర్యలు తీసుకోవాలని అమెరికాకు చెందిన ద్వైపాక్షిక చట్టసభ్యుల బృందం ట్రంప్ ప్రభుత్వాన్ని కోరింది. డెమొక్రటిక్ సెనేటర్లు రాన్ వైడెన్, షెల్డన్ వైట్‌హౌస్, రిపబ్లికన్ ప్రతినిధి పాట్ హారిగన్ కలిసి అమెరికా వాణిజ్యశాఖ మంత్రి హోవర్డ్ లుట్నిక్‌కు ఈ మేరకు లేఖ రాశారు.
సన్‌కిస్డ్ ఆర్గానిక్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, బెల్‌ట్రాక్స్ ప్రైవేట్ లిమిటెడ్, సైబర్‌రూట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలపై వారు ఆరోపణలు చేశారు. అమెరికా పౌరులు, వ్యాపార సంస్థలు, న్యాయవాదులను లక్ష్యంగా చేసుకుని ఈ సంస్థలు నిఘా, హ్యాకింగ్ కార్యకలాపాలకు పాల్పడ్డాయని చట్టసభ్యులు పేర్కొన్నారు. ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు, ప్రముఖ అమెరికా న్యాయ సంస్థలకు చెందిన 1,000 మందికి పైగా న్యాయవాదులను లక్ష్యంగా చేసుకున్న హ్యాకింగ్ కార్యకలాపాలతో ఈ సంస్థలకు సంబంధాలున్నట్లు తమ లేఖలో పేర్కొన్నారు. ఈ మూడు సంస్థలను అమెరికా కామర్స్ డిపార్ట్‌మెంట్ ‘ఎంటిటీ లిస్ట్’లో చేర్చి, అమెరికా సాఫ్ట్‌వేర్, క్లౌడ్ మౌలిక సదుపాయాలు, సైబర్ సెక్యూరిటీ టూల్స్‌కు వాటి ప్రాప్యతను పరిమితం చేయాలని వారు కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!