

శశి థరూర్ ఎంపీ సీట్ల పునర్విభజన అంశంపై చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. జీతాల పెంపు ఉదాహరణను ప్రస్తావిస్తూ, శాతం పరంగా పెరుగుదల ఒకేలా ఉన్నా అందరికీ సమాన ప్రయోజనం కలగదని వివరించారు. రూ.2 లక్షలు సంపాదించే వ్యక్తికి, రూ.20 వేల జీతం పొందే వ్యక్తికి 50 శాతం పెంపు ఇచ్చినా ఇద్దరికీ ఒకే శాతం పెరుగుదల ఉన్నప్పటికీ, అధిక ఆదాయం పొందే వ్యక్తికే ఎక్కువ లాభం చేకూరుతుందని పేర్కొన్నారు.
అదే విధంగా లోక్‌సభ సీట్ల పెంపులో కూడా దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని థరూర్ అన్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌కు 80 మంది ఎంపీలు, కేరళకు 20 మంది ఎంపీలు ఉన్నారని, భవిష్యత్తులో అవి 120 మరియు 30కి పెరిగితే శాతం పరంగా పెరుగుదల ఒకేలా కనిపించినా రాజకీయ ప్రభావం విషయంలో భారీ వ్యత్యాసం ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. అదనంగా ఉత్తరప్రదేశ్‌కు 40 మంది ఎంపీలు పెరిగితే, కేరళకు కేవలం 10 మంది మాత్రమే పెరుగుతారని, ఇది రాజకీయ బలాబలాలపై ప్రభావం చూపే అంశమని ఆయన అభిప్రాయపడ్డారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!