

రష్యా ఉక్రెయిన్‌పై 450 దీర్ఘశ్రేణి డ్రోన్లు, వివిధ రకాల 70 క్షిపణులతో భారీ దాడి చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీ మంగళవారం తెలిపారు. కీవ్‌కు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్ పర్యటనకు కేవలం ఒక రోజు ముందు ఈ దాడి జరగడం విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే అబుధాబీలో అమెరికా మధ్యవర్తిత్వంతో బుధవారం శాంతిచర్చలు మళ్లీ ప్రారంభం కానున్న సమయంలో రష్యా దాడుల తీవ్రతను పెంచిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యుత్ కేంద్రాలు, ఇతర సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిగాయని చెప్పారు.
చలికాలం తీవ్రంగా ఉన్న ఈ సమయంలో ప్రజలకు అవసరమైన వెలుగు, వేడి అందించే విద్యుత్ సరఫరాను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే రష్యా ఈ దాడులకు పాల్పడిందని జెలెన్స్కీ ఆరోపించారు. ఉక్రెయిన్‌లోని ఐదు ప్రాంతాలపై ఒకేసారి దాడులు జరిగాయని, ఈ ఏడాది విద్యుత్ నెట్‌వర్క్‌పై జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని ప్రైవేట్ విద్యుత్ సంస్థ డీటెక్ తెలిపింది. ఈ పరిస్థితుల్లో ఉక్రెయిన్‌కు గగనతల రక్షణ పరికరాలు అందించాలని, రష్యాపై అంతర్జాతీయంగా మరింత ఒత్తిడి తీసుకురావాలని జెలెన్స్కీ మిత్ర దేశాలను కోరారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!