

వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. మొరాదాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇతర పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. చర్చలు ప్రారంభించేందుకు ఇదే సరైన సమయమని, ఆలస్యం కాకముందే సమాజ్‌వాదీ పార్టీ స్పందించాలని ఆయన కోరారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం తమకు ఇష్టం లేదని, అందుకే కలిసి పోరాడేందుకు సిద్ధమని చెప్పారు.
తాను పోటీ చేస్తే ఇతర పార్టీలకు నష్టం జరుగుతుందని భావిస్తే, వారితో కలిసి పోటీ చేయడానికి కూడా సిద్ధమేనని ఒవైసీ పేర్కొన్నారు. తమ పార్టీ న్యాయం, సమానత్వం, గౌరవం కోసం పోరాడుతోందని, ఏ మతానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. మరోవైపు, ఒవైసీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఇది ఓటు బ్యాంకు రాజకీయాలకు నిదర్శనమని, ఒవైసీ, అఖిలేష్ యాదవ్ ఇద్దరూ ఒకే నాణేనికి రెండు వైపులని బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా విమర్శించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!