
జనరల్

రామ్ చందర్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రోల్ ధరల విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. ధరల పెరుగుదలపై పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్, వాస్తవానికి ప్రజలపై అధిక పన్నుల భారం మోపుతోందని విమర్శించారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర సుమారు ₹96గా ఉంటే, కాంగ్రెస్ పాలిత తెలంగాణలో అదే పెట్రోల్ దాదాపు ₹111కు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి లీటర్‌పై అదనంగా సుమారు ₹15 భారం వేస్తూ సామాన్యుల జేబులకు గండి కొడుతున్నారని ఆరోపించారు. ప్రజలపై పన్నుల భారం మోపుతూ మరోవైపు వారి కష్టాలపై మొసలి కన్నీరు కార్చడం కాంగ్రెస్ విధానమని వ్యాఖ్యానించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!