
ఓటీటీ

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన గ్రామీణ క్రీడా నేపథ్య యాక్షన్ డ్రామా పెద్ది జూలై 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఘన విజయాన్ని అందుకుంది. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అయితే ఓటీటీ విడుదలకు ముందు ప్రేక్షకుల్లో ఒక కీలక సందేహం నెలకొంది. జాన్వీ కపూర్ పోషించిన అచ్చియమ్మ పాత్రపై విమర్శలు రావడంతో మేకర్స్ కొన్ని సన్నివేశాలను తొలగించి, కొత్త సీన్స్ జోడించి థియేటర్లలో ప్రదర్శించారు. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ఏ వెర్షన్‌ను విడుదల చేస్తారనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఈ అంశంపై ఇప్పటివరకు నెట్‌ఫ్లిక్స్ లేదా చిత్ర బృందం అధికారికంగా స్పందించలేదు. దీంతో అభిమానులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!