
జనరల్

కృష్ణా నదీ జలాల పంపిణీపై తెలంగాణ వ్యక్తం చేసిన అభ్యంతరాల నేపథ్యంలో ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్ విచారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రం తరఫున వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు జైదీప్ గుప్తా, ఉమాపతి నేతృత్వంలోని న్యాయవాదుల బృందం విజయవాడకు చేరుకుంది. జల వనరుల శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్ర వాదనలు, తెలంగాణ అభ్యంతరాలపై సమగ్ర సమీక్ష నిర్వహించనున్నారు.
అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఇప్పటివరకు జరిగిన విచారణపై వివరించి, తదుపరి వ్యూహంపై చర్చించే అవకాశముంది. మరోవైపు పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్‌కు కౌంటర్ దాఖలు చేసేందుకు కూడా ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇదే సమయంలో అంతర్రాష్ట్ర జల వివాదాల విభాగంలో కీలక ఇంజనీర్ నియామకంపై కూడా చర్చ కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!