

ఆంధ్రప్రదేశ్‌లో పురపాలక ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. 92 పురపాలికల్లో జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన 10,262 మంది అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) రాష్ట్రవ్యాప్తంగా 138 కేంద్రాల్లో ఏర్పాట్లు చేసింది. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భారీ భద్రత కల్పించడంతో పాటు సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 138 కౌంటింగ్ కేంద్రాల్లో అధికారులు 6,831 టేబుళ్లను సిద్ధం చేశారు. ఓట్ల లెక్కింపు, పర్యవేక్షణ కోసం మొత్తం 47,817 మంది సిబ్బందిని విధుల్లో నియమించారు. 13 కార్పొరేషన్లు, 92 మున్సిపాలిటీల పరిధిలో జరిగిన పోలింగ్‌లో సగటున 62.16 శాతం ఓటింగ్ నమోదైంది. అభ్యర్థులు, రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!