
బిజినెస్

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న విద్యార్థి నిరసనలపై కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ తీవ్రంగా విమర్శించారు. ఇంత పెద్ద స్థాయిలో ఆందోళనలు జరుగుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో స్పందించకపోవడాన్ని ప్రశ్నించారు. ప్రతిపక్షాన్ని కాకుండా ప్రభుత్వాన్ని నిలదీయాలని మీడియాకు సూచిస్తూ, విద్యార్థుల డిమాండ్లపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సమాధానం కోరాలని అన్నారు.
విద్యార్థులపై లాఠీచార్జ్ ఘటనలపై, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎప్పుడు జరుగుతుందో ప్రశ్నించాలని ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు. అలాగే ఇంటర్నెట్ సేవల నిలిపివేత, విద్యార్థులపై ఎన్‌ఎస్‌ఏ అమలు వంటి అంశాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను ఉగ్రవాదులుగా చూస్తున్నారా అని ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!