
జనరల్

పంజాబ్ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మద్యం సేవించి అసెంబ్లీకి వచ్చారని ప్రతిపక్ష సభ్యులు ఆరోపించారు. మే డే సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సీఎం ప్రసంగిస్తున్నప్పుడు పలుమార్లు తడబడ్డారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సభ్యులందరికీ బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించాలని స్పీకర్‌ను కోరారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన ఈ ఆరోపణలతో అసెంబ్లీలో వాగ్వాదం చెలరేగింది. శిరోమణి అకాలీ దళ్ నేతలు సీఎం ప్రసంగ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం సరికాదని వారు విమర్శిస్తూ, నిజం బయటపడేందుకు ప్రజల సమక్షంలో డోప్ టెస్ట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ వివాదంపై స్పందించిన సీఎం భగవంత్ మాన్ హుందాగా వ్యవహరించాలని, అనవసర వాదనలను నివారించాలని సభ్యులకు సూచించారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!