

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన కృత్రిమ మేధస్సు సదస్సు సందర్భంగా జరిగిన నిరసనలపై కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. యువ కాంగ్రెస్ కార్యకర్తలు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలను ప్రస్తావిస్తూ అర్ధనగ్నంగా నిరసన తెలపడం దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించిందని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి దిశగా దేశం ముందుకు సాగుతున్న సమయంలో ఇలాంటి చర్యలు రాజకీయ నిరాశను చూపిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
మీరట్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, ప్రపంచ వేదికపై దేశ గౌరవాన్ని కాపాడాల్సిన సందర్భంలో ఈ తరహా ప్రదర్శనలు చేయడం బాధాకరమన్నారు. దేశాన్ని విమర్శించడం కంటే అభివృద్ధికి సహకరించడం అవసరమని సూచించారు. ఈ ఘటనను ఖండించిన మిత్రపక్షాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రయోజనాల కంటే రాజకీయ లాభాలను ముందుకు పెట్టడం తగదని ప్రధాని స్పష్టం చేశారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!