
గాసిప్స్

లోక్సభలో ప్రధానిపై దాడికి సిద్ధమయ్యారన్న ఆరోపణలను కాంగ్రెస్ ఎంపీలు ఖండించారు. మహిళా ఎంపీలపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలను దూషించేందుకే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు.
తమ నిరసన పూర్తిగా శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలోనే కొనసాగిందని కాంగ్రెస్ ఎంపీలు స్పష్టం చేశారు. సభలో హింసకు దిగే ఉద్దేశం తమకు లేదని తెలిపారు. విపక్ష ఎంపీల పార్లమెంటరీ హక్కులను కాలరాస్తూ ఎనిమిది మంది ఎంపీలను సస్పెండ్ చేశారని విమర్శిస్తూ, విపక్షాలను ఎదుర్కొనే ధైర్యం ప్రధానికి లేదని ఆరోపించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!