
.jpeg&w=3840&q=75)
తిరుమలలో శుక్రవారం ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీవెంకటేశ్వరస్వామివారి దర్శనానికి విచ్చేశారు. పద్మావతి విశ్రాంతి భవనం నుంచి బయలుదేరిన రాష్ట్రపతి, తిరుమల క్షేత్ర విశిష్ట ఆచారాన్ని అనుసరించి ముందుగా శ్రీ భూవరాహస్వామివారిని దర్శించుకున్నారు. తరువాత శ్రీవారి ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతిని టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి ఆత్మీయంగా స్వాగతం పలికారు. అర్చకులు ఆలయ సంప్రదాయ మర్యాదలతో రాష్ట్రపతికి ఇస్తికఫాల్ స్వాగతం అందించారు.
ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం రాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్శనలో ఆమెతో పాటు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఉన్నారు. రంగనాయకుల మండపంలో రాష్ట్రపతికి వేదాశీర్వచనం నిర్వహించారు. అనంతరం టీటీడీ అధికారులు శ్రీవారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను, 2026 క్యాలెండర్, డైరీలను రాష్ట్రపతికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, జానకి దేవి, భాను ప్రకాష్ రెడ్డి, సీవీఎస్వో మురళీకృష్ణ, జిల్లా కలెక్టర్ డాక్టర్ వేంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!