

పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ, శ్రీ సత్యసాయిబాబా జీవితం విశ్వప్రేమకు నిదర్శనమని అన్నారు. ఆయన బోధనలు అనేక లక్షల మందిని సన్మార్గం వైపు నడిపించాయని, మానవ సేవకు ఆయన చూపిన మార్గం ఇప్పటికీ కోట్లాది భక్తుల ద్వారా కొనసాగుతున్నదని పేర్కొన్నారు.
సత్యసాయి సందేశాలు కేవలం ఆధ్యాత్మికతకే పరిమితం కాకుండా, సమాజ సేవకు పెద్ద పునాది వేసినవని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. సత్యసాయి ట్రస్టు ద్వారా ఉచితంగా అందిస్తున్న వైద్య, విద్యా సేవలు వేలాది ప్రజలకు ఆశాకిరణాలుగా నిలుస్తున్నాయని తెలియజేశారు.
మనుషుల్ని సేవా మార్గంలోకి తీసుకెళ్లగల శక్తి సత్యసాయిబాబా బోధనల్లో ఉందని ఆమె ప్రశంసించారు. సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం తనకు పెద్ద అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్రపతి చెప్పారు. ఇలాంటి మహనీయుల జీవితం ప్రతి వ్యక్తికి స్ఫూర్తిదాయకమని ఆమె పేర్కొన్నారు.



.jpg&w=3840&q=75)
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!