
క్రీడలు

నల్లగొండలో రాజకీయ ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. బీజేపీ, BJYM కార్యకర్తలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సందర్భంగా కార్యాలయం వద్ద ఉన్న ఫ్లెక్సీలను చింపడంతో పాటు టమాటాలు, కోడిగుడ్లు విసిరినట్లు సమాచారం. ఈ ఘటనతో నల్లగొండలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
ఆ తర్వాత బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇంట్లోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేసినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్న సమయంలోనే దాడి జరిగినట్లు బీజేపీ వర్గాలు ఆరోపించాయి. వరుస దాడులు, ప్రతీకార దాడులతో నల్లగొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు పార్టీల మధ్య రాజకీయ ఘర్షణలు మరింత ముదరకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!