31, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐవీఎఫ్‌ కేంద్రాలపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

Writer: Nithish 05:00 PM, 31 ఆగస్టు, 2026
ఐవీఎఫ్‌ కేంద్రాలపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

తెలంగాణలో ప్రభుత్వ రంగంలో ఫర్టిలిటీ, ఐవీఎఫ్‌ సేవలను మరింత విస్తరించడంతో పాటు ప్రైవేట్‌ ఫర్టిలిటీ కేంద్రాల్లో ఏఆర్‌టీ, సరోగసీ చట్టాల అమలును కట్టుదిట్టం చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఫర్టిలిటీ, ఐవీఎఫ్‌ కేంద్రాల పనితీరును పరిశీలించారు. గాంధీ ఆస్పత్రి, పేట్లబుర్జు ఎంజీఎంహెచ్‌లోని ప్రభుత్వ ఐవీఎఫ్‌ కేంద్రాల్లో ఇప్పటివరకు 39,802 మంది రోగులకు సేవలు అందించగా, 20,185 ఫాలిక్యులర్‌ స్టడీలు, 521 ఐయూఐ, 545 ఐవీఎఫ్‌ ప్రక్రియలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. జిల్లాల్లోనూ దశలవారీగా ఐవీఎఫ్‌ సేవలను విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి సూచించారు.

రాష్ట్రంలో 477 ఏఆర్‌టీ, సరోగసీ కేంద్రాలు నమోదై ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రైవేట్‌ ఫర్టిలిటీ కేంద్రాల్లో 379 తనిఖీలు నిర్వహించగా 50 కేంద్రాల్లో నిబంధనల ఉల్లంఘనలు గుర్తించినట్లు వెల్లడించారు. వీటిలో రెండు కేంద్రాల రిజిస్ట్రేషన్లు రద్దు చేయగా, తొమ్మిది కేంద్రాల అనుమతులను తాత్కాలికంగా రద్దు చేశారు. నిబంధనలు ఉల్లంఘించే కేంద్రాలపై ఎలాంటి ఉపేక్ష లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. రోగులపై అనవసర ఆర్థిక భారం పడకుండా పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు. అలాగే పీసీపీఎన్‌డీటీ చట్టం అమలులో భాగంగా ఏప్రిల్‌ నుంచి జూలై వరకు 2,600 తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. లింగ నిర్ధారణకు పాల్పడే అవకాశమున్న కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని మంత్రి ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌.. పొన్నం ప్రభాకర్‌ తీవ్ర ఆగ్రహం

రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌.. పొన్నం ప్రభాకర్‌ తీవ్ర ఆగ్రహం

పరిశ్రమలన్నీ 33 శాతం పచ్చదనం పాటించాలి

పరిశ్రమలన్నీ 33 శాతం పచ్చదనం పాటించాలి

చంద్రబాబు సభలో తెలంగాణ జానపద పాట సందడి

చంద్రబాబు సభలో తెలంగాణ జానపద పాట సందడి

భారీగా విరిగిపడ్డ కొండచరియలు

భారీగా విరిగిపడ్డ కొండచరియలు

ఎస్‌సీవో సదస్సులో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ భేటీ...

ఎస్‌సీవో సదస్సులో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ భేటీ...

ట్యాగ్లు
దామోదర్ రాజనర్సింహతెలంగాణ ఆరోగ్య శాఖఐవీఎఫ్ సేవలుఫర్టిలిటీ సెంటర్లుఏఆర్‌టీ చట్టంసరోగసీ చట్టంపీసీపీఎన్‌డీటీ చట్టంగాంధీ ఆస్పత్రిపేట్లబుర్జు ఆస్పత్రితెలంగాణ ఆరోగ్య వార్తలు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
మూసీ పునరుజ్జీవనానికి కీలక అడుగు.

మూసీ పునరుజ్జీవనానికి కీలక అడుగు.

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐవీఎఫ్‌ కేంద్రాలపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
జనరల్

ఐవీఎఫ్‌ కేంద్రాలపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌.. పొన్నం ప్రభాకర్‌ తీవ్ర ఆగ్రహం
జనరల్

రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌.. పొన్నం ప్రభాకర్‌ తీవ్ర ఆగ్రహం

పరిశ్రమలన్నీ 33 శాతం పచ్చదనం పాటించాలి
జనరల్

పరిశ్రమలన్నీ 33 శాతం పచ్చదనం పాటించాలి

చంద్రబాబు సభలో తెలంగాణ జానపద పాట సందడి
జనరల్

చంద్రబాబు సభలో తెలంగాణ జానపద పాట సందడి

వెలిగొండకు వైఎస్సార్ వెలుగైతే.. చంద్రబాబు చీకటి: వైఎస్ షర్మిలా రెడ్డి
రాజకీయాలు

వెలిగొండకు వైఎస్సార్ వెలుగైతే.. చంద్రబాబు చీకటి: వైఎస్ షర్మిలా రెడ్డి

భారీగా విరిగిపడ్డ కొండచరియలు
జనరల్

భారీగా విరిగిపడ్డ కొండచరియలు

ఆ తేదీన జీఎస్టీ కౌన్సిల్ కీలక భేటీకి సిద్ధం
బిజినెస్

ఆ తేదీన జీఎస్టీ కౌన్సిల్ కీలక భేటీకి సిద్ధం

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘కోణార్క్’ను విడుదల చేసిన ఏథర్
టెక్నాలజీ

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘కోణార్క్’ను విడుదల చేసిన ఏథర్

లలితా జ్యూవెల్లరీ భారీ విస్తరణకు సిద్ధం
బిజినెస్

లలితా జ్యూవెల్లరీ భారీ విస్తరణకు సిద్ధం

ఎస్‌సీవో సదస్సులో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ భేటీ...
జనరల్

ఎస్‌సీవో సదస్సులో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ భేటీ...

మూసీ పునరుజ్జీవనానికి కీలక అడుగు.
జనరల్

మూసీ పునరుజ్జీవనానికి కీలక అడుగు.

జీఎస్టీ 2.0తో ఆటో రంగంతో పాటు అన్ని రంగాలకు ఊతం: మారుతీ సుజుకీ ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ
బిజినెస్

జీఎస్టీ 2.0తో ఆటో రంగంతో పాటు అన్ని రంగాలకు ఊతం: మారుతీ సుజుకీ ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ