

టాలీవుడ్‌లో మరో క్రేజీ జోడీ వెలుగులోకి వచ్చింది. నటి కావ్య కల్యాణ్‌రామ్, ప్రముఖ సంగీత దర్శకుడు కాల భైరవ తమ ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. గత కొంతకాలంగా వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుండగా.. తాజాగా సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఈ జంట ఆ వార్తలకు చెక్ పెట్టింది. కాల భైరవతో కలిసి దిగిన క్యూట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కావ్య.. తన జీవితంలోకి వచ్చిన ప్రత్యేక వ్యక్తి గురించి భావోద్వేగంగా రాసుకొచ్చారు. సరైన వ్యక్తి దొరికినప్పుడు ప్రపంచమే మరింత అందంగా కనిపిస్తుందని పేర్కొన్నారు.
తన సాధారణ రోజులను సైతం ప్రత్యేకంగా మార్చినందుకు భైరవకు కావ్య ధన్యవాదాలు తెలిపారు. తాను వద్దన్నా తనకు డైట్ కోక్ కావాలని గుర్తుపెట్టుకునే వ్యక్తిగా భైరవను సరదాగా ప్రశంసించారు. దీనికి కాల భైరవ కూడా స్పందిస్తూ తమ బంధం జీవితాంతం కొనసాగుతుందనే భావనను వ్యక్తం చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో ఈ జంట కలిసి కనిపించడంతో అప్పట్లోనే వార్తలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు తమ ప్రేమను అధికారికంగా ప్రకటించడంతో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం మొదలైంది. అయితే పెళ్లి తేదీపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా గంగోత్రిలో నటించిన కావ్య.. మసూద, బలగం చిత్రాలతో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి తనయుడైన కాల భైరవ ఆర్‌ఆర్‌ఆర్ సహా పలు చిత్రాలకు సంగీతం అందించి ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈ జంట ప్రేమ ప్రకటనతో అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!