

పోలీసులకు జీతాలు రాష్ట్ర ప్రజలే ఇస్తారని, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి లేదా ఆయన అనుచరులు కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీసులు బాధితులకు సేవ చేయాల్సిన బాధ్యత ఉందని ఆయన పేర్కొన్నారు. కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో దాడి జరిగిన తర్వాత బాధితులు ఫిర్యాదు చేయగా పోలీసులు సరైన స్పందన ఇవ్వలేదని విమర్శించారు. అయితే అధికార పార్టీ నాయకులతో మాట్లాడి కౌంటర్ కంప్లైంట్ ఇవ్వాలని సూచించారని ఆయన ఆరోపించారు.
బిడ్డకు పాలు ఇవ్వాల్సిన తల్లి న్యాయం కోసం రోడ్డు మీద కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నాగర్కర్నూల్ అధికార యంత్రాంగం ఆ బిడ్డతో పాటు రాజ్యాంగాన్ని కూడా ఖననం చేసిందని తీవ్రంగా విమర్శించారు. బీఆర్ఎస్ తరఫున కుమ్మెర బాధిత కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందజేసిన ఆయన, రాబోయే రోజుల్లో రూ.10 లక్షలతో ఇల్లు నిర్మించి గృహప్రవేశానికి తానే హాజరవుతానని హామీ ఇచ్చారు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!