
జనరల్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రాం రెడ్డి తన కుమారుడు భరత్ రెడ్డి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడనే వార్తలను ఖండించారు. మంగళ్ హాట్ పోలీసులు అరెస్ట్ చేశారన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. మీడియా లో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు.
ఈ రోజు ఉదయం పోలీసులు తమ ఇంటికి వచ్చి డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా సహకరించాలని కోరినట్లు తెలిపారు. పోలీసుల విచారణ అనంతరం తన కుమారుడు డ్రగ్స్ తీసుకోలేదని తేలిందని వెల్లడించారు. కామన్ ఫ్రెండ్స్ ఫోన్ లిస్ట్‌లో ఉన్న ఒకరి సమాచారం ఆధారంగా విచారణ జరిపినట్లు చెప్పారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!