

పుట్టపర్తి సత్యసాయి బాబా శతజయంతి వేడుకల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరుకానుండటంతో రాష్ట్ర యంత్రాంగం పుట్టపర్తి ప్రాంతంలో భద్రతా చర్యలను మరింత బలపరిచింది. ఈ శతజయంతి ఉపన్యాసాలు, కార్యక్రమాలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ హాజరుకానున్నారు. అన్ని శాఖలు వేడుకల నిర్వహణ కోసం సమన్వయంతో పనిచేస్తున్నాయి.
ఈ నెల 19 వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. విమానాశ్రయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రి నారా లోకేశ్ కలిసి ప్రధానికి స్వాగతం పలుకనున్నారు. అనంతరం ప్రధాని ప్రత్యేక కాన్వాయిలో ప్రశాంతి నిలయానికి బయలుదేరుతారు.
ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ సభ మందిరంలో మోదీ సత్యసాయి బాబా మహా సమాధిని దర్శించుకోనున్నారు. తరువాత హిల్ వ్యూ స్టేడియంలో నిర్వహించే శతజయంతి వేడుకల్లో పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్‌తో పాటు శతజయంతి కమిటీ సభ్యులు, ఏపీ మంత్రుల బృందం పాల్గొంటారు.
అదే కార్యక్రమాల భాగంగా ఈ నెల 22 న సత్యసాయి యూనివర్సిటీ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ముఖ్య అతిథులుగా హాజరవుతారు. వీవీఐపీల రాకపోకల దృష్ట్యా ప్రభుత్వం సుమారు 2500 మంది పోలీసు సిబ్బందిని మోహరించింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!