

దేశ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి రోజున లోక్‌సభ, రాజ్యసభలు ఒకేసారి సమావేశం కానున్నాయి. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి సంప్రదాయ ప్రసంగం చేయనున్నారు.
ఫిబ్రవరి 1 న కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. విశేషమేమిటంటే, ఈసారి ఆదివారం రోజున బడ్జెట్ ప్రవేశపెట్టడం దేశ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం పలు కీలక బిల్లులను సభ ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విధానానికి సంబంధించిన వన్ నేషన్–వన్ ఎలక్షన్ బిల్లు పై చర్చ జరగనుంది. అలాగే, 30 రోజులకు పైగా జైల్లో ఉంటే ముఖ్యమంత్రి లేదా మంత్రులు తమ పదవులను కోల్పోవాల్సిన నిబంధనలతో కూడిన మరో బిల్లు పై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.
ఈ బిల్లులు ఆమోదం పొందితే, దేశ రాజకీయ వ్యవస్థలో గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!