Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఏపీ బడ్జెట్‌లో మోసాలు, కల్పిత లెక్కలు మాత్రమే కనిపించాయి - వైఎస్ జగన్

08:06 AM, 11 మార్చి, 2026
ఏపీ బడ్జెట్‌లో మోసాలు, కల్పిత లెక్కలు మాత్రమే కనిపించాయి - వైఎస్ జగన్

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, రాష్ట్ర బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే మూడు బడ్జెట్‌లు ప్రవేశపెట్టిందని, దాదాపు 16 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పటికీ ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా అనే ప్రశ్న తలెత్తుతుందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌ను పరిశీలిస్తే మోసాలు, కల్పిత లెక్కలు మాత్రమే కనిపిస్తున్నాయని జగన్ విమర్శించారు. అలాగే రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరుగుతున్నట్లు కాగ్ (CAG) నివేదిక స్పష్టంగా చూపిస్తోందని ఆయన పేర్కొన్నారు.

2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.80 వేల కోట్ల అప్పులు తీసుకుందని జగన్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్-6, సూపర్-7 పథకాలు అమలు చేయకపోవడంతో పాటు తమ ప్రభుత్వం ప్రారంభించిన అనేక సంక్షేమ పథకాలను కూడా రద్దు చేశారని విమర్శించారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేసిందని ఆయన గుర్తుచేశారు. తమ ఐదేళ్ల పాలనలో ఎన్బీసీ పరిమితికి తక్కువగానే అప్పులు చేశామని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ఎన్బీసీ పరిమితికి మించి రూ.12 వేల కోట్లకు పైగా అప్పులు చేసిందని జగన్ అన్నారు. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం మొత్తం రూ.3.80 లక్షల కోట్ల అప్పులు చేసిందని, తమ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.3.30 లక్షల కోట్ల అప్పులు మాత్రమే తీసుకుందని ఆయన వివరించారు.

రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా జరుగుతోందని జగన్ ఆరోపించారు. “దోచుకో, పంచుకో, తినుకో” అనే విధంగా పాలన సాగుతోందని ఆయన విమర్శించారు. ఇసుక, మట్టి, మద్యం, భూములు వంటి అన్ని రంగాల్లో అవినీతి జరుగుతోందని తెలిపారు. ఇలా అన్ని వనరులు దోచుకుంటే ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తుందని ప్రశ్నించారు. విశాఖపట్నంలో సుమారు రూ.5 వేల కోట్ల విలువైన భూమిని ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు సమీప బంధువుకు కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. అలాగే రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా భూములను అతి తక్కువ ధరలకు కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఆదాయం ఎలా పెరుగుతుందని ప్రశ్నించిన జగన్, ప్రస్తుతం కరోనా వంటి పరిస్థితులు లేనప్పటికీ ట్రెజరీలో కనీస నిల్వలు కూడా లేవని విమర్శించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

సూచించబడిన పోస్ట్‌లు
‘లేచింది మహిళాలోకం’ ట్రైలర్ విడుదల

‘లేచింది మహిళాలోకం’ ట్రైలర్ విడుదల

యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్న ‘ఆయా షేర్’ పాట!

యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్న ‘ఆయా షేర్’ పాట!

 భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు..

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు..

తెలంగాణలో భారీగా పెరగనున్న ఎండలు

తెలంగాణలో భారీగా పెరగనున్న ఎండలు

కరూర్ తొక్కిసలాట కేసు: టీవీకే అధినేత విజయ్‌కు మళ్లీ సీబీఐ సమన్లు!

కరూర్ తొక్కిసలాట కేసు: టీవీకే అధినేత విజయ్‌కు మళ్లీ సీబీఐ సమన్లు!

తల్లికి కాస్ట్ లీ కార్ గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్

తల్లికి కాస్ట్ లీ కార్ గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్

'టాక్సిక్' మూవీ వాయిదా కారణం ఇదేనా?

'టాక్సిక్' మూవీ వాయిదా కారణం ఇదేనా?

పాప రీల్‌కు స్పందించిన విజయ్ దేవరకొండ

పాప రీల్‌కు స్పందించిన విజయ్ దేవరకొండ

ఖతార్‌లో 313 మంది అరెస్ట్

ఖతార్‌లో 313 మంది అరెస్ట్

ధురంధర్‌ 2 తర్వాత ఆ సినిమా చేయనున్న సారా?

ధురంధర్‌ 2 తర్వాత ఆ సినిమా చేయనున్న సారా?

ట్యాగ్లు
వైఎస్ జగన్వైఎస్సార్‌సీపీఏపీ బడ్జెట్ఆంధ్రప్రదేశ్ రాజకీయాలుచంద్రబాబు నాయుడుకూటమి ప్రభుత్వంఏపీ అసెంబ్లీరాజకీయ వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు
భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
బిజినెస్

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

అయోధ్యను తాకిన వంటగ్యాస్‌ కొరత
న్యూస్

అయోధ్యను తాకిన వంటగ్యాస్‌ కొరత

సీఈసీపై ఇంపీచ్మెంట్ నోటీసు ఇవ్వడానికి సిద్ధమైన ఇండియా కూటమి
రాజకీయాలు

సీఈసీపై ఇంపీచ్మెంట్ నోటీసు ఇవ్వడానికి సిద్ధమైన ఇండియా కూటమి

మహేష్ బాబు అభిమానులకు క్షమాపణ చెప్పిన దర్శకుడు హరీష్ శంకర్
సినిమాలు

మహేష్ బాబు అభిమానులకు క్షమాపణ చెప్పిన దర్శకుడు హరీష్ శంకర్

ఐపీఎల్‌కు రోహిత్ శర్మ రిటైర్ మెంట్ ?
క్రీడలు

ఐపీఎల్‌కు రోహిత్ శర్మ రిటైర్ మెంట్ ?

తెలంగాణలో ఎండలు, వానలు - వాతావరణ నిపుణుల హెచ్చరిక
న్యూస్

తెలంగాణలో ఎండలు, వానలు - వాతావరణ నిపుణుల హెచ్చరిక

ఎమ్మెల్యే దానం నాగేందర్ కామెంట్స్
రాజకీయాలు

ఎమ్మెల్యే దానం నాగేందర్ కామెంట్స్

స్పీకర్ తీర్పు ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం - బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామ్ చందర్ రావు
రాజకీయాలు

స్పీకర్ తీర్పు ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం - బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామ్ చందర్ రావు

ఈ నెల 13 నుంచి ఓటీటీలో 'కపుల్ ఫ్రెండ్లీ' మూవీ!
ఓటిటి

ఈ నెల 13 నుంచి ఓటీటీలో 'కపుల్ ఫ్రెండ్లీ' మూవీ!

మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై స్పష్టత..
న్యూస్

మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై స్పష్టత..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!