
జనరల్

ఎన్. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఆశయాలను భావితరాలకు అందించడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఎన్.టి. రామారావు ఆశయ సాధనలో భాగంగానే నారా లోకేశ్ మహిళలకు 33 శాతం సీట్లు ప్రకటించారని తెలిపారు. తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనేది ప్రజలందరి డిమాండ్ అని ఆయన అన్నారు.
మాహానాడు వేదికపై మాట్లాడిన చంద్రబాబు, పార్టీ స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి రావడం ఎన్టీఆర్ ప్రత్యేకత అని పేర్కొన్నారు. “సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు” అనే ఎన్టీఆర్ సిద్ధాంతం శాశ్వతంగా కొనసాగుతుందని తెలిపారు. దేశానికి, రాష్ట్రానికి విశేష సేవలు అందించిన ఎన్టీఆర్‌కు భారత అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని మాహానాడు వేదిక ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!