
క్రీడలు

జనగణనపై ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా ప్రజలు తమ వివరాలను నమ్మకంగా నమోదు చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. దేశాభివృద్ధి మరియు భవిష్యత్తు ప్రణాళికల కోసం జనగణన చాలా ముఖ్యమని ఆయన తెలిపారు. పూర్తి వివరాలు ఇస్తే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని కొందరు చేస్తున్న ప్రచారం అసత్యమని స్పష్టం చేశారు.
"ప్రజలు ఇచ్చే ప్రతి సమాచారం అత్యంత గోప్యంగా ఉంటుంది. ఏ ప్రాంతంలో ఎలాంటి అవసరాలు ఉన్నాయి, ఉపాధి అవకాశాలు ఎక్కడ కల్పించాలనే విషయంలో ప్రభుత్వానికి ఒక స్పష్టత రావడానికి ఈ వివరాలు దోహదపడతాయి తప్ప, పథకాల కోతకు కాదు" అని ఆయన వివరించారు.
వచ్చే నెల 10 వరకు స్వీయ గణన విధానం అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత వచ్చే నెల 11 నుండి జూన్ 9 వరకు అధికారులు ఇంటింటికీ వెళ్లి వివరాలను సేకరిస్తారు. ప్రజలు ఎలాంటి సందేహాలు లేకుండా సహకరించి సరైన వివరాలు ఇవ్వాలని కోరారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!