

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ, తమ దాడులతో ఇరాన్కు భారీ నష్టం వాటిల్లిందన్నారు. యురేనియం శుద్ధి, బాలిస్టిక్ క్షిపణుల తయారీ సామర్థ్యం ఇక ఇరాన్‌కు లేదని చెప్పారు. తన మరణంపై వచ్చిన వార్తలను సరదాగా కొట్టిపారేస్తూ తాను సజీవంగానే ఉన్నానని తెలిపారు. ఇరాన్‌లో ప్రస్తుతం పరిస్థితులు స్పష్టంగా లేవని, అక్కడి రాజకీయ, సైనిక వ్యవస్థల్లో విభేదాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. యుద్ధం కొనసాగితే అమెరికా, ఇజ్రాయెల్ గెలుస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ సైనిక చర్య మూడు ప్రధాన లక్ష్యాలతో జరుగుతోందని నెతన్యాహు తెలిపారు. ఇరాన్ నుంచి అణు ముప్పును తొలగించడం, దాని సైనిక శక్తిని బలహీనపరచడం, ప్రజలకు స్వేచ్ఛ కల్పించడం ప్రధాన ఉద్దేశ్యమన్నారు. క్షిపణి నిల్వలు, తయారీ కేంద్రాలను దెబ్బతీసినట్లు చెప్పారు. సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్‌పై దాడి తమే చేశామని, ఇకపై అలాంటి దాడులు చేయొద్దని డొనాల్డ్ ట్రంప్ సూచించారని వెల్లడించారు. అమెరికాను యుద్ధంలోకి లాగుతున్నారన్న ఆరోపణలను ఖండిస్తూ, అమెరికా తన ప్రయోజనాల ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. హర్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణాను అడ్డుకునే ప్రయత్నం ఇరాన్ చేస్తుందని, అయితే అది విజయవంతం కాదని నెతన్యాహు తెలిపారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!