
జనరల్

హెల్లే లింగ్ స్వెండ్సెన్ మరియు నార్వేలోని భారత రాయబార కార్యాలయం మధ్య జరిగిన సోషల్ మీడియా సంభాషణ వైరల్‌గా మారింది. నరేంద్ర మోదీ ఓస్లో పర్యటన సందర్భంగా నార్వే ప్రధాని జోనాస్ గార్ స్టోరేతో సంయుక్త కార్యక్రమం అనంతరం మీడియా ప్రశ్నలు తీసుకోకుండా వెళ్లిపోవడాన్ని జర్నలిస్ట్ ప్రశ్నించారు.
తన పోస్టులో నార్వే 2026 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో మొదటి స్థానంలో ఉందని, భారత్ 157వ స్థానంలో ఉందని ఆమె ప్రస్తావించారు. అనంతరం భారత రాయబార కార్యాలయం ఆమెను ఓస్లోలో జరిగే అధికారిక మీడియా సమావేశానికి ఆహ్వానించింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మీడియా స్వేచ్ఛ, మీడియా యాక్సెస్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!