
సినిమాలు

అమరావతిలోని టీడీపీ పార్టీ కార్యాలయానికి మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ నేడు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా పార్టీకి చెందిన సీనియర్ నేతలతో ఆయన సమావేశం కానున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత, అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలపై ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.
ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు లోకేశ్ పార్టీ కార్యాలయంలో ఉండనున్నట్లు సమాచారం. స్థానిక ఎన్నికలకు సంబంధించిన పార్టీ పరమైన ఏర్పాట్లు, అభ్యర్థుల ఎంపికపై నేతలతో చర్చించనున్నారు. ఈ సమావేశాల్లో జరిగే చర్చల ఆధారంగా ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!