

వ్యక్తులు కాదు.. వ్యవస్థే ముఖ్యమనే లక్ష్యంతో ఐటీడీపీని మరింత బలోపేతం చేయాలని టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ సూచించారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఐటీడీపీ విభాగంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పార్టీ నేతలకు పలు దిశానిర్దేశాలు చేశారు. ఐటీడీపీ కమిటీల నియామకాలను వీలైనంత త్వరగా పూర్తి చేసి, విభాగాన్ని మరింత సమర్థంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని లోకేష్ అన్నారు. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టేందుకు ఐటీడీపీ మరింత చురుగ్గా పనిచేయాలని సూచించారు. ఐటీడీపీ సభ్యులందరినీ ‘మై టీడీపీ యాప్’తో అనుసంధానించాలని, ఇతర పార్టీ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ సాంకేతికంగా మరింత అభివృద్ధి చెందాలని అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ పాల్గొన్నారు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!