
జనరల్

తెలంగాణ కేబినెట్ నుంచి మంత్రి కొండా సురేఖను తొలగిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు గవర్నర్‌కు లేఖ పంపినట్లు తెలుస్తోంది. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారన్న ఆరోపణల నేపథ్యంలో కొండా సురేఖతో పాటు పలువురు నేతలపై చర్యలు తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇదే సమయంలో తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్‌గా డా. జి. చిన్నారెడ్డి నియామకాన్ని ప్రభుత్వం రద్దు చేసి, ఆయన స్థానంలో గద్వాల్ విజయలక్ష్మిని నియమించింది. అలాగే తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నెరెళ్ల శారద నియామకానికి ఆమోదం తెలిపింది. కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్‌పర్సన్‌గా మాజీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణిని నియమించేందుకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సమాచారం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!