

‘డ్రాగన్’ సక్సెస్‌తో జోష్‌లో ఉన్న కయాదు లోహర్ వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఆమె నటించిన ‘ఐయామ్ గేమ్’ థియేటర్లలో విడుదల కాగా, నాని హీరోగా తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’లో సుబ్బలక్ష్మి పాత్రలో కనిపించనున్నారు. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య 48వ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికయ్యారు. టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. సూర్య వంటి గొప్ప నటుడి పక్కన నటించాల్సి రావడంతో మొదట్లో లొకేషన్‌లో చాలా భయంగా అనిపించిందని కయాదు తెలిపారు. ఒక సన్నివేశానికి సిద్ధమయ్యేందుకు తనకు కేవలం ఐదు నిమిషాల సమయం మాత్రమే దొరకడంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యానని చెప్పారు.
మొదట్లో కొత్త పాత్రలోకి మారడం వల్లే ఆ ఒత్తిడి ఉందని భావించినా, నాలుగు రోజులు గడిచినా టెన్షన్ అలాగే కొనసాగిందని కయాదు వెల్లడించారు. ప్రస్తుతం ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ, తన పాత్రకు పూర్తి న్యాయం చేయడంపైనే దృష్టి పెడుతున్నానని తెలిపారు. సూర్య స్క్రీన్‌పై ఉన్నప్పుడు ఆయన నుంచి చూపు తిప్పుకోవడం కష్టమని, ఆయనతో ఆరోగ్యకరమైన పోటీ వాతావరణంలో తన ఉత్తమ నటనను అందించేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్, యోగిబాబు, కుమరవేల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా, ప్రస్తుతం షూటింగ్ వేగంగా కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!